యోగా సర్కస్ కాదు మోది
నిత్యం రాజకీయ వాతావరణంతో వాడివేడిగా ఉండి దేశరాజధాని ఢిల్లీ నగరం యోగాలయంగా మారింది. యోగాసనాలతో జాతికి ఆరోగ్యదిశా నిర్దేశం చేసింది. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్‌పథ్ ప్రధానే వేదికగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 40 వేలమంది పాల్గొని సామూహిక యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందు వరుసలో కూర్చుని, స్వయంగా యోగాసనాలు వేస్తూ అందరిలోనూ స్ఫూర్తిని నింపారు. అంతకుముందు ప్రధాని అక్కడున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్‌పథ్ యోగాపథ్ అవుతుందని ఎప్పుడైనా ఊహించారా? అని అడిగారు. శాంతి, సద్భావన కోసమే యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, యోగా ఒక రోజుకు పరిమితం కాదని అన్నారు. ప్రజాజీవితంలో యోగా సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. సమస్యలను యోగా దూరం చేస్తుందని, మానసిక వికాసాన్ని కలిగించి అంతఃస్సౌందర్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ప్రధాని ప్రసంగం తర్వాత ప్రార్థనతో యోగా దినోత్సవం ప్రారంభమైంది. ముందుగా అక్కడున్నవారితో సూక్ష్మ వ్యాయామం, శ్వాసతో ముడిపడిన పలు యోగా ప్రక్రియలు చేయించారు. అందరికీ అర్థమయ్యేలా హిందీ, ఆంగ్ల భాషల్లో సూచనలిచ్చారు. తాడాసనం, వృక్షాసనం, పాదహస్తాసనం, అర్థచక్రాసనం, త్రికోణాసనం, దండాసనం, వక్రాసనం వంటి పలు ఆసనాలు వేయిస్తూ... ఈ ఆసనాలు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. ఏ వ్యాధులను నివారించుకోవచ్చో తెలిపారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్రమంత్రులు, ఎంపీలు, అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








